The Threat of Rice Blast: Protecting Your Paddy Crop​ (English and Telugu)

Written by Madhulatha Saina | 24 June 2023

rice blast in paddy telugu for indian farmers

Introduction :

Blast is one of the important diseases effecting the paddy crop, where its infestation starts from Nursery to main field in later stages it effects neck region leads to neck blast. It is estimated that it causes overall loss of 20-30% in the paddy crop Favourable conditions for this disease is having low temperatures in night and high RH in day time, indiscriminate usage of Urea, DAP, and close planting favours this disease Now let us discuss about Blast its damaging symptoms, preventive measures and control measures to be followed in the crop .

Symptoms :

1.spindle-shaped and whitish to gray with necrotic borders on leaves where Several spots coalesce to form big irregular patches

2.nodal infection causes the culm to break at the infected node

3.Lesions on the neck are grayish brown and causes the girdling of the neck and the panicle to fall over

Preventive measures :

1.Avoid grasses and other weeds on bunds and inside.

2.Dry seed treatment with Pseudomonas fluorescens talc formulation @10g/kg of seed.

3.Sprinkle 2.5 kg of P. fluorescens (talc) and mix with stagnated water. Soak the root system of seedlings for 30 min and transplant.

4.Spray P. fluorescens talc formulation @ 0.5% from 45 days after transplanting at 10 day intervals, three times.

Control Measures :

1. Initially should apply 15-20 Kgs MOP and avid stagnation of water in the field

2. Initial stages of the incidence apply Tricyclazole ( Beam, Sivic) @120gms/acre

3. Later stages go for the application of Isoprothioline ( fujione) @500 ml or Tricyclazole + Mancozeb ( merger) @ 500gms / acre

4. At severe stages apply Trifloxystrobin+tebuconazole (Nativo) @ 100 gms /acre

 

PROTECTING PADDY CROP FROM BLAST (TELUGU)

ఇంట్రడక్షన్ :  

వరి లో సోకే అనేక తెగుల్లలో ముఖ్యమైనది అగ్గి తెగులు ఇది నారుమడి నుండి మొదలయ్యి ప్రధాన పొలంలోకి విస్తరించి వెన్ను దశలో మెడ విరుపు గా ఆశిస్తుంది.ఈ తెగులు ఆశిస్తే దాదాపు 20-30% దిగుబడులు తగ్గే అవకాశాలుంటాయి. ఇది ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువుగా ఉండడం గాలి లో తేమ ఎక్కువుగా ఉండడం, రైతులు యూరియా, DAP, ఎరువులను ఎక్కువ గా వాడడం దగ్గరగా నాటులు వెయ్యడం వంటి కారణాల వలన అగ్గి తెగులు వ్యాప్తి కి దోహదం పడుతున్నాయి. అలాంటి ఈ తెగులును నివారించడానికి కావాల్సిన మందులు మరియు తెగుళ్లు లక్షణాలని తెలుసుకుందాం. రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అగ్గి తెగులు ని సమర్థవంతంగా నివారించగలరు.

 లక్షణాలు: 

•నారుమడి మరియు ప్రధాన పొలంలో ఆకుల మీద నూలికండి ఆకారం లో మచ్చలు కనపడి క్రమేణా అవి పెద్దవయ్యి మచ్చల అంచులు ముదురు గోధుమ రంగులో లేదా నలుపు రంగులో ఉండి మధ్య లో బూడిద రంగు లేదా తెలుపు రంగులో ఉంటాయి 

•అనుకూల పరిస్తితి లో ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి ఆకులు ఎండిపోతాయి

 •తెగులు తీవ్రస్థాయి లో ఉన్నప్పుడు దూరం నుంచి పొలం తగలబడినట్లు కనిపిస్తుంది

 •అలానే ఈ తెగులు పిలక దశ లో మచ్చలు ఆకుల మీద నుండి కణుపుల మీద కి సోకి కణుపులు కుల్లి పోతాయి 

•ఇంకా పంట ఈనే దశ లో మెడ పైన నల్లని మచ్చలు ఏర్పడి కంకులకి పోషకాలు అందక మెడ విరిగి వేలాడ్తుంటాయి అలానే తాలు గింజలు తయారవుతాయి. 

నివారణ చర్యలు : 

1.గడ్డి మరియు ఇతర కలుపు మొక్కలను నివారించండి 

2.సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ 10గ్రాములు కిలో విత్తనాలు చొప్పున విత్తన శుద్ది చేసుకోవాలి 

3.నారు నాటే ముందు 30 నిమిషాలు పాటు సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ మిశ్రమం నీటి లో పెట్టవలెను.

 4. సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ @0.5% చొప్పున ప్రధాన పొలం లో 45 వ రోజునుండి 15 రోజుల వ్యవధి లో 3 సార్లు పిచికారి చేసుకోవలెను 

నియంత్రణ చర్యలు : 

1.దీనిని నివారించడానికి ముందు 15-20 కిలోల MOP ని చల్లుకోవాలి అలానే నీరు నిలవ ఉండకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలి . 

2.తొలి దశ లో తెగుళ్లు ని నివారించడానికి ట్రైసైకిలోజోల్ ( బీమ్, సివిక్) ని ఎకరాకు 120 గ్రాముల చొప్పున పిచికారి చేసుకోవాలి 

3.తరువాత దశలలో (ఐసోప్రోతియోలీన్) ఫ్యూజిఒన్ @ 500ml లేదా ట్ట్రైసైకిలోజోల్ + మేంకోజెబ్ ( మెర్జర్) ఎకరాకు 500 గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవాలి 

4.తీవ్రస్థాయి లో ట్రైఫ్లోక్సిస్టోరబిన్+టెబూకొనాజోల్ (నేటివో) ని ఎకరాకు 100 గ్రాముల చొప్పున పిచికారి చేసుకోవాలి.

 

 

VIDEO EXPLANATION IN TELUGU