Written by Bhavani Mekela | 14 October 2022
We are going to discuss about very serious pest Paddy stem borer in paddy crop, This pest starts its infestation from nursery and damages tillers during tillering stage and effects panicles during panicle inititaion stage leads to formation of Dead hearts and white ears repectively which results in heavy yield losses.
Now let us discuss about Stem borer its damaging symptoms, preventive measures and control measures to be followed in the crop .
Symptoms :
1.Avoid grasses and other weeds on bunds and inside.
2. In nursery apply Carbofuran 3G Granules @2 kgs for 10 cents
3. In Main field during tillering stage apply Carbofuran 3G Granules@ 10 kgs or Cartap hydrochloride 4G @8kgs or Chloranthriniliprole @4kgs per acre
4. Clipping of Seedlings before transplanting
5. Install light traps @10 per acre
Control measures:
1.During initial stages apply Thiomethoxam+Lambda cyhalothrin (Alika) @80ml per acre
2.Apply Chloranthriniliprole (Ampligo, Coragen ) @ 80ml per acre
3.Apply Cartap hydrochloride (Caldan SP) 2500 gms per acre
4.During severe infestation go for Flubendamide ( Fame) @50ml per acre
TIPS TO OVERCOME YELLOW STEM BORER IN PADDY (TELUGU) :
ఇంట్రడక్షన్ :
వరి లో ప్రధాన చీడ అయిన కాండం తొలుచు పురుగు కోసం తెలుసుకుందాం.ఇది నారుమడి దశ నుండి ఆశిస్తుంది. పిలక దశ లో మొవ్వ ను నాశనం చేస్తూ మొవ్వు పురుగు గా మరియు ఈనిక దశ లో కంకి ని నాశనం చేస్తూ తెల్ల కంకి పురుగు గా పైరు కి తీవ్ర నష్టపరుస్తుంది అలాంటి ఈ పురుగు ని నివారించడానికి గాను కావాల్సిన మందులు, చీడ లక్షణాలను తెలుసుకుందాము
లక్షణాలు :
1.పిలక దశ లో పొలం లో చనిపోయిన మొవ్వ లు గమనించవచ్చు మరియు వీటిని సులభం గా మొక్క నుండి పీకివేయవచ్చు
2.ఈనిక దశ లో తెల్ల కంకులు కనిపిస్తుంటాయి
3.కాండం మరియు పిలకలు పైన చిన్న రంధ్రాలు గమనించవచ్చు
4.ఎండిపోయిన మొవ్వ కాండం లో పురుగు విసర్జన ని గమనించవచ్చు
నియంత్రణ చర్యలు :
1. గడ్డి మరియు ఇతర కలుపు మొక్కలను నివారించండి
2. 2కిలో ల కార్బోఫ్యూరాన్ 3G గులెకలు చొప్పున 10 సెంట్ ల నారుమడి కి వేసుకోవాలి
3. ప్రధాన పొలం లో పిలక దశ అంటే దుబ్బు కట్టిన దశ లో కార్బోఫ్యూరాన్ 3G గులెకలు -10 కిలో లు లేదా కార్తప్ హైడ్రో క్లోరైడ్ -4G గులెకలు @8కిలో లు లేదా క్లోరంత్రీనిలిప్రోలే గులీకలు @4కిలో ల చప్పున ఒక ఎకరానికి వేసుకోవాలి
4. నారు ని ప్రధాన పొలం లో నాటే ముందు వాటి చిగురులని త్రుంచి వెయ్యాలి
5.లైట్ ట్రాప్ లను @10 ఎకరాకి పెట్టుకోవాలి
నివారణ చర్యలు :
1. తొలి దశలలో తయోమేథోక్షం + లాంబ్డా సైహలోత్రైన్ ( సిన్జెంట అలిక) @80 ml ఎకరాకు పిచికారి చేసుకోవాలి
2.క్లోరంత్రీనిలిప్రోలే ( సిన్జెంట అంప్లిగో, కొరేజన్) @80 ml ఎకరాకు పిచికారి చేసుకోవాలి
3.కార్తప్ హైడ్రో క్లోరైడ్ ( కల్డన్ sp) @500 గ్రాములు ఎకరాకు పిచికారి చేసుకోవాలి
4.ఫ్లూబెండఅమైడ్ (బేయర్ ఫేమ్) @ 50 ml ఎకరాకు పిచికారి చేసుకోవాలి
VIDEO EXPLANATION IN TELUGU